Share News

రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:55 PM

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) షట్‌డౌన్‌పై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
TG Minister Thummala Nageswara Rao

హైదరాబాద్, ఆగస్టు 22: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) షట్‌డౌన్‌పై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల సుమారు 10 రోజుల పాటు యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా డిమాండ్‌ అధికంగా ఉన్న వేళ ఈ షట్‌డౌన్‌ ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ రాశారు.


గత ఖరీఫ్‌ సీజన్‌లో112 రోజుల పాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌‌లో యూరియా ఉత్పత్తి నిలిపి వేశారని గుర్తు చేశారు. ఈ సంస్థ తరచూ షట్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ద్వారా రైతులకు యూరియా అందించడంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కీలకమని ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం షట్‌డౌన్‌ను త్వరగా ముగించి యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆయన కోరారు.


ఆర్‌ఎఫ్‌సీఎల్‌ లోటును ఇతర దేశీయ ప్లాంట్లు, దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా తగినంత యూరియా నిల్వలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నేటి (ఆగస్టు 22) నుంచి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని షట్‌డౌన్‌ చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

బీసీఐ చైర్మన్ మిశ్రా రాజీనామా చేయాలి: కో చైర్మన్ సదాశివరెడ్డి డిమాండ్

Read More Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 05:16 PM