Share News

దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:17 PM

ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి, అడవిలో సాహసాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఏటు వైపు నుంచి అయినా.. అపాయం రావచ్చు.

దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్
Giant Python Attacks Tourist Swinging by River

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి, అడవిలో సాహసాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఏటు వైపు నుంచి అయినా.. అపాయం రావచ్చు. అలాంటి ఓ దిగ్భ్రాంతికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే.. ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ వీడియోలో.. అడవిలో చెట్ల మధ్య నది ప్రవహిస్తోంది. ఓ యువకుడు నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మకు కట్టిన ఊయల ఊగుతున్నాడు. మరో వ్యక్తి నది ఒడ్డున ఉన్న చెట్టు వద్ద నిలుచుని ఉన్నాడు. ఇంకో వ్యక్తి నది నీటిలో నిలబడి ఉన్నాడు.


అయితే చెట్లు పొదల్లో ఉన్న భారీ కొండచిలువ.. ఊయల ఊగుతున్న వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఊహించని ఘటనకు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతే ఊయల ఊగుతున్న వ్యక్తి ఏ మాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకేశాడు. చెట్టు పొదల వద్ద ఉన్న వ్యక్తి కూడా నదిలోకి అమాంతంగా దూకేశాడు.


నదిలో నిలుచున్న వ్యక్తి.. ఒడ్డుకు పరుగు పెట్టాడు. ఈ సంఘటన మొత్తం కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఊయల ఊగే వ్యక్తి ప్రాణాలు పోయేవి. ఈ వీడియోను sanjukgupta 1987 పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


అడవిలో.. జంతువులు ఉండే ప్రాంతంలోకి వెళ్లడం మూర్ఖపు పని అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. అయినా అతడు ప్రాణాలతో బయటపడటం అదృష్టమని తెలిపారు. వన్యప్రాణులు ఉండే ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని మరో నెటిజన్ సూచించారు.

Updated Date - Aug 22 , 2026 | 03:43 PM