Share News

కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయాన్ని తరలించొద్దు

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:12 AM

ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ వాజ్‌పాయ్‌ని ఆదేశించారు.

కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయాన్ని తరలించొద్దు

  • కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకే ఉపయోగించాలి

  • హనుమకొండ కలెక్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హనుమకొండ/హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ వాజ్‌పాయ్‌ని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయాన్ని తరలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో వివాదం రేగింది. కవులు, కళాకారులు, కాళోజీ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.


ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లగా.. ఆయన స్పందించి దిద్దుబాటు చర్యలను చేపట్టారు. కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా సహా ఇతర ఏ ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదని ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా కాళోజీ ఫౌండేషన్‌ సభ్యులతో చర్చించాకే కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయాలని కూడా సూచించారు. కాగా, కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయం తరలించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల కాళోజీ ఫౌండేషన్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 08:12 AM