Share News

టార్గెట్‌ సిరిసిల్ల, సిద్దిపేట!

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:58 AM

బీఆర్‌ఎస్‌ పార్టీకి కీలకమైన సిరిసిల్ల, సిద్దిపేటలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా భారీ బహిరంగ సభలకు సిద్ధమయ్యారు.

టార్గెట్‌ సిరిసిల్ల, సిద్దిపేట!
Revanth Reddy Sircilla rally

  • భారీ సభలకు సిద్ధమవుతున్న రేవంత్‌

  • 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ

  • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

  • అక్టోబరు మొదటి వారంలో సిద్దిపేటలో సభ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి కీలకమైన సిరిసిల్ల, సిద్దిపేటలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా భారీ బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ నెల 30న నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అక్టోబరు మొదటి వారంలో హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో సీఎం సభ ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.


ఈ రెండు సభలను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని డీసీసీ అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల శాసనసభలో 22ఏపై చర్చ సందర్భంగా కేటీఆర్‌, హరీశ్‌లు భూ దోపిడీలకు పాల్పడ్డారంటూ సర్వే నంబర్లతో సహా రేవంత్‌రెడ్డి వివరాలు బయటపెట్టారు. ఈ క్రమంలో సిరిసిల్ల, సిద్దిపేటల్లో సీఎం బహిరంగ సభలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరబడితే.. తమ ప్రభుత్వం వచ్చాక కలెక్టర్‌ 2 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని రేవంత్‌ చెప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేటలో హరీశ్‌ అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో సీఎం రేవంత్‌.. ఈ భూముల వ్యవహారంపై ఎదురుదాడి చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగదీశ్‌రెడ్డికి వందల కోట్ల ఆస్తులు
కాంగ్రెస్‌ నేతల ఆస్తుల వద్దకు బీఆర్‌ఎస్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 08:30 AM