Share News

ఎన్నికల ఖర్చు వసూలు చేయలేం

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:00 AM

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నుంచి ఎన్నికల ఖర్చు వసూలు చేయడం, వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేకుండా నిషేధించడంపై ఎలాంటిచట్టాలు లేనప్పుడు...మేమెలా వసూలు చేయిస్తాం? ఆ చట్టాన్ని మేమెలా సవరించగలం? చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది’ అని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఎన్నికల ఖర్చు వసూలు చేయలేం
madrashigh court

  • రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్య

చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నుంచి ఎన్నికల ఖర్చు వసూలు చేయడం, వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేకుండా నిషేధించడంపై ఎలాంటిచట్టాలు లేనప్పుడు...మేమెలా వసూలు చేయిస్తాం? ఆ చట్టాన్ని మేమెలా సవరించగలం? చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది’ అని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజులకే తమ పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి ఆ ఎన్నిక ఖర్చును వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గత ఎన్నికల ఖర్చుల వివరాలు వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని కోరవచ్చని, కానీ గత ఎన్నికల ఖర్చులు వసూలు చేయాలని కోరలేరని వ్యాఖ్యానించింది. సదరు అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేఽధం విధించడం సాధ్యం కాదంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Updated Date - Sep 22 , 2026 | 04:06 AM