చిత్ర పరిశ్రమపై సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:03 PM
తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ల కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్తున్నారన్నారు.
హైదరాబాద్, మార్చి 06: తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ల కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్తున్నారన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కొత్వాల్ గూడలో ఎకో హిల్ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం అన్నారంటే.. ‘మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకువచ్చారు. నాటి నిజాం నవాబ్ ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో వరదల నివారణకు మూసిపై నిర్మాణాలు చేపట్టారు. వికారాబాద్‌లో నిజాం నవాబ్ మెడిసిన్ ప్లాంట్‌లు నాటారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ తదితర చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్‌లో ఉన్నాయి.
హైదరాబాద్ ఆక్రమణలతోపాటు చెత్తతో నిండిపోయింది. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్. నగరాన్ని మంచిగా చేస్తానంటే వాళ్లు ఒప్పుకోవడం లేదు. మేము చేయలేదు.. నువ్వు చేయొద్దని అంటున్నారు. వాళ్లకు ఫార్మ్ హౌస్‌లు వచ్చాయి. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపాం. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారింది. మూసి మురికిలో బతకాలని ఎవరు అనుకోరు. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారబోతుంది.
బెంగళూరు, అమరావతి, చెన్నైకి ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళను అనాథలను చేయబోం. భూమి, ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటాం. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. ట్రంప్, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు హైదరాబాద్‌కు రాబోతున్నాయి. ప్రపంచంతో పోటీపడేలా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు. అక్క చాలా కాలం మంత్రిగా పని చేసింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వాళ్లను వీళ్లను తీసుకొచ్చి విమర్శిస్తుంది.
అక్క కుటుంబానికి 40 సంవత్సరాలు అండగా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటుంది. ఏం చేసినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డు పడుతున్నాడు. హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం. మూసి పక్కన నైట్ ఎకానమినీ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం. ఆయా నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాలను చూసి వాటిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం.
పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాం.. సన్న బియ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ చీరల్లో ఆడ బిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారు. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి వాడారు. ఈ సారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తాం. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి’.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతోపాటు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి.. ఎన్నిక లాంఛనమే
For More TG News And Telugu News