ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు.. కేంద్రం అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Aug 23 , 2026 | 03:45 PM
తన అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతోనే నిరాకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం స్పందించారు. ఈ అంశంపై తాను హైదరాబాద్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు..
లండన్, ఆగస్టు 23: తన అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతోనే నిరాకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం స్పందించారు. యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తాను హైదరాబాద్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు. ఈ పర్యటనకు అనుమతి లేకపోవడంతో.. బోస్టన్ వెళ్లకుండానే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలిపారు.
మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు చేరుకుంటానని సీఎం చెప్పారు. లండన్ పర్యటనలో అన్ని సమావేశాలు, కార్యక్రమాలు పూర్తి చేశానని వివరించారు. తన అమెరికా పర్యటనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలతోపాటు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి గత బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్ పర్యటన ముగించుకుని.. అనంతరం యూఎస్‌లో ఆయన పర్యటించాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఆయన పర్యటనను ఎందుకు నిరాకరించామో కూడా వివరించింది. అయితే సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ యూఎస్ పర్యటనను కేంద్రం కావాలనే అడ్డుకుందంటూ ఆయన మండిపడ్డారు. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ సీఎంకు యుఎస్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ సీఎంకు నిరాకరించడం.. ద్వంద్వ వైఖరికి నిదర్శమని ఆరోపించింది.
వార్తలు కూడా చదవండి..
రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ‘ఛత్రోంకీ గూంజ్’ పెట్టాలి: రాంచందర్‌రావు
గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
For More TG News And Telugu News