మూసీ ప్రాజెక్ట్ భూసేకరణను వేగవంతం చేయండి.. సీఎం రేవంత్ ఆదేశాలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:30 PM
మూసీ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్‌పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 25: మూసీ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్‌పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్‌లను పిలవాలని ఆదేశించారు.
ప్రాజెక్ట్‌లకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపైన మునిసిపల్ కమిషనర్‌లు దృష్టి సారించాలని సీఎం తెలిపారు. టీడీఆర్‌పై ప్రతి వారం సమీక్ష జరగాలని చెప్పారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలని ఆదేశించారు. కొత్వాల్ గూడా బర్డ్స్ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.
ఈరోజు(మంగళవారం) MCRHRD బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వి.కర్ణన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు
అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం
Read Latest Telangana News And Telugu News