Share News

ఆన్‌లైన్ స్నేహం పేరుతో భారీ మోసం.. రూ.కోటిన్నర పోగొట్టుకున్న యువతి

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:07 PM

చనిపోతానని బెదిరించి ఓ యువతి నుంచి రూ.కోటిన్నర కొట్టేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్నాప్‌చాట్‌లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. ఆమెను నమ్మించి మోసం చేశాడు.

ఆన్‌లైన్ స్నేహం పేరుతో భారీ మోసం.. రూ.కోటిన్నర పోగొట్టుకున్న యువతి
Vijayawada cyber crime

విజయవాడ, ఆగస్టు 25: చనిపోతానని బెదిరించి ఓ యువతి నుంచి రూ.కోటిన్నర కొట్టేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్నాప్‌చాట్‌లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. ఆమెను నమ్మించి మోసం చేశాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి మోసపోయానని డబ్బులు ఇవ్వాలంటూ నమ్మించాడు. విడతల వారీగా డబ్బులు ఇచ్చినప్పటికీ మరింతగా ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో చివరకు సదరు యువతి పోలీసులను ఆశ్రయించారు.


విజయవాడకు చెందిన యువతి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గౌతం అనే యువకుడు స్నాప్‌చాట్‌‌లో యువతికి పరిచమయ్యాడు. తాను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించాడు. క్రిప్టో కరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు యువతికి గౌతం చెప్పాడు. నిజమేనని నమ్మిన యువతి మొదట రూ.10 లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు కావాలని లేదంటే.. చనిపోతానని బెదిరించి విడతల వారిగా కోటిన్నర వసూలు చేశాడు. అయితే గౌతం వేధింపులు తాళలేక బాధిత యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు

అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 03:57 PM