రైతాంగం పచ్చగా ఉంటే రాజ్యం బాగుంటుంది: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:43 PM
ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. నంగునూరు మండలం నర్మేట గ్రామంలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అలానే అక్కడే 40 కోట్లతో చేపట్టనున్న ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు.
సిద్ధిపేట జిల్లా, మార్చి22: ఇవాళ(ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. నంగునూరు మండలం నర్మేట గ్రామంలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అలానే అక్కడే 40 కోట్లతో చేపట్టనున్న ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..' గత ప్రభుత్వ నిర్వాకల వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా రైతులకు భరోసా ఇస్తూ రూ. 2 లక్షల ఏకబిగిన రుణమాఫీ చేశాం. రైతాంగం పచ్చగా ఉంటే రాజ్యం బాగుంటుంది. మొదటి రెండేళ్లలో లక్షా 4 వేల కోట్లు రైతులకు ఇచ్చాం. రైతు కళ్లలో ఆనందం చూసే దాకా ఎవరేమన్నా వెనకడుగు వేయం. రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకుంటున్న పంటలకు కూడా బోనస్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ రోజు ఆయిల్ పామ్ పంట 30 జిల్లాల్లో వస్తున్నది. అందుకే ఆగమేఘాల మీద ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ పూర్తి చేసి ప్రారంభించుకుంటున్నాం' అని తెలిపారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ..'కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో అమలు చేస్తూ వస్తున్నాం. ఎవరెన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ఒక విజన్, దూరదృష్టి ఉంది. కాంగ్రెస్, సోనియా ఒక మాట ఇస్తే అది నెరవేరుతుంది. కాంగ్రెస్ మైనార్టీల, పేదల, బీసీ, ఎస్సీల పక్షపాత ప్రభుత్వం' అని అన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..' తెలంగాణ వస్తె ప్రజల ఆశలు నెరవేరుతాయన్న ఆశలు ప్రజల్లో ఉన్నట్టుగానే పక్కనే ఉన్న తపసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు అందేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాను. మల్లన్నసాగర్ కు భూములిచ్చిన రైతులకు ఇంకా చాలా మందికి పరిహారం అందలేదు. ప్రాజెక్టుకు భూములు త్యాగం చేసిన దుబ్బాక కు సాగు నీరు అందించాలని సీఎం కు విజ్ఞప్తి. గతంలో నేను ఎమ్మెల్యేగా పని చేసిన దుబ్బాక అభివృద్ధికి కృషి చేయాలి' అని ఆయన తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్.. ' రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర. వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎలాంటి వాతావరణం లో అయినా సాగు చేసే పంట ఆయిల్ పామ్. ఈ చుట్టుపక్కల రైతులంతా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి. ఈ ఫ్యాక్టరీ నీ ఉపయోగించుకోవాలి. మాది రైతు రాజ్యం' అని ఆయన అన్నారు. 'ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది. రైతును రాజు చేయడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నది. కొంతమంది గుంటనక్కలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల పక్షాన పనిచేస్తాం. సాధబైనామ సమస్యలను కూడా కొద్ది రోజుల్లో పరిష్కరిస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం.సిద్దిపేటలో పింక్ కలర్ చొక్కాలు వేసుకున్న పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. మా టైం లో కట్టిణం అంటున్నారు.. మీరు తెల్ల కాగితాన్ని నల్లకాగితంగా చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక నిర్మించాం. ఒంటి నిండా విషం నింపుకున్న వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన
హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు