Share News

ప్రజా పాలనకు గాంధీజీ ఆశయాలే కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:23 AM

అహింసనే ఆయుధంగా మలచి దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీజీ.. మానవాళికి సత్యం, శాంతి, మానవత్వం వంటి విలువలను బోధించిన మహనీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

ప్రజా పాలనకు గాంధీజీ ఆశయాలే కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అహింసనే ఆయుధంగా మలచి దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీజీ.. మానవాళికి సత్యం, శాంతి, మానవత్వం వంటి విలువలను బోధించిన మహనీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా పాలనకు గాంధీజీ ఆశయాలే కీలకమని పేర్కొన్నారు.


గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో శాంతి, సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి దిశగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు మనమందించే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:23 AM