నేడు ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:03 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవం..
ఎన్‌ఐయుఎం క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత యాచారం మండలం మంగలితండా వద్ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయుఎం) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీని సందర్శిస్తారు. ఆ ప్రాంగణంలోనే నిర్వహించబోయే ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ కార్యాలయానికి చేరుకుని పనులపై సమీక్షించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International