‘ఉత్తమ వైద్యం అందిస్తాం’.. చిన్నారి ఆర్యాంశ్‌కు సీఎం రేవంత్ అండ
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:57 PM
స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్-2తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 12: స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్-2తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యాంశ్ చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్ నిధుల నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడాది వయసున్న ఆర్యాంశ్ ప్రాణాలను కాపాడేందుకు ఇంజెక్షన్‌కు రూ.1.5 కోట్లు అవసరం. జూన్ 20లోపు ఇంజెక్షన్ స్లాట్‌ను బుక్ చేసుకోవాలని, జులై నెలాఖరులోగా చికిత్స పూర్తిచేయాలని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో ప్రజల సహకారంతో ఇప్పటివరకు రూ.75 లక్షలను తల్లిదండ్రులు సేకరించారు. మరో రూ.75 లక్షలు కావాల్సి ఉండగా.. ఆ నిధుల సమీకరణకు ప్రభుత్వ సాయంపై ఆశలు పెట్టుకున్నారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కావాల్సిన నిధులపై యూట్యూబర్ ఆదిరెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిరెడ్డి పోస్ట్‌కు సీఎం వెంటనే స్పందించారు. ‘చిన్నారికి ఉత్తమ చికిత్స అందేలా చేస్తాం. సీఎంఆర్‌ఎఫ్ అధికారులు.. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. ఆర్యాంశ్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఎక్స్‌లో రేవంత్ పోస్ట్ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎంఆర్‌ఎఫ్ అధికారులు తక్షణమే చిన్నారి ఆర్యాంశ్ తల్లిదండ్రులను సంప్రదించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చింది: సీఎం చంద్రబాబు
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్
Read Latest Telangana News And Telugu News