పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:37 PM
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు.
అనంతపురం, జూన్ 12: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు. అనుచరులతో కలిసి వెళ్తున్న మున్సిపల్ చైర్మన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి జేసీ నిరసనకు దిగారు. ఫ్యాక్షన్ చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెద్దారెడ్డికి పోలీసులు భద్రత కల్పించడంపై ఆయన మండిపడ్డారు. పెద్దారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు.
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని మొదటగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురంకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ జేసీ ఆందోళనకు దిగారు. అనుచరులతో కలిసి కేతిరెడ్డి ఇంటి వద్దకు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఆయన అక్కడే బైఠాయించి ఆందోళకు దిగారు.
ఇవి కూడా చదవండి..
రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
వారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News