ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగాలు గర్వకారణం
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:38 AM
రాష్ట్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి కథనాన్ని షేర్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ప్లేస్‌మెంట్లలో ఏటీసీల హవా’’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.
ఈ మేరకు ఆ వార్తా క్లిప్పింగును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడం సత్ఫలితాలనిస్తోందని సీఎం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్యాబినెట్ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు
తల్లికి వైద్యం అందడం లేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి
Read Latest AP News And Telangana News And International News And Telugu News