Share News

డీలిమిటేషన్‌, మహిళా బిల్లు ఆమోదం ఖాయం

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:10 AM

కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే డీలిమిటేషన్‌, మహిళా బిల్లు ఆమోదం పొందటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తంచేశారు.

డీలిమిటేషన్‌, మహిళా బిల్లు ఆమోదం ఖాయం

  • కాంగ్రెస్‌ అడ్డుకున్నా ఆగదు: రాంచందర్‌ రావు

నల్లగొండ/హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే డీలిమిటేషన్‌, మహిళా బిల్లు ఆమోదం పొందటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ.. రాహుల్‌గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.


ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. 1971వ సంవత్సరంలో 56 కోట్ల జనాభా ఉంటే, అప్పటి డీలిమిటేషన్‌తో 543 లోక్‌సభా స్థానాలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం 140 కోట్ల జనాభాకు 850 లోక్‌ సభా స్థానాలు ఏర్పడితే వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్‌ రాంచందర్‌ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.


స్టాలిన్‌ను ఆపేందుకు రేవంత్‌ పాట్లు

పునర్విభజన బిల్లుకు డిఎంకే మద్దతు ఇవ్వకుండా సీఎం రేవంత్‌ నానా పాట్లు పడుతున్నారని రాంచందర్‌ రావు అన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసి ఆయన మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సినిమా హాస్యంతో కూడిన ఒక వీడియోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 04:12 AM