నల్సార్‌లో ఉమర్ ఖలీద్‌పై డాక్యుమెంటరీ ఎలా ప్రదర్శించారు: రాజాసింగ్
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:20 AM
నల్సార్ వర్సిటీ ఆఫ్ లా క్యాంపస్‌లో సెప్టెంబరు 23న ఉమర్ ఖలీద్‌పై రూపొందించిన ‘ప్రిజనర్ నం.626710 ఈజ్ ప్రజెంట్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నల్సార్ వర్సిటీ ఆఫ్ లా క్యాంపస్‌లో సెప్టెంబరు 23న ఉమర్ ఖలీద్‌పై రూపొందించిన ‘ప్రిజనర్ నం.626710 ఈజ్ ప్రజెంట్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంటరీలను కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలో వర్సిటీ క్యాంప్‌సలలో ప్రదర్శించాలా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖలీద్ నిందితుడిగా ఉన్నారని, ఆయనపై ఉపాతో పాటు ఇతర చట్టాల కింద అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు.డాక్యుమెంటరీ ప్రదర్శన ఎలా నిర్వహించారనే అంశంపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పాలిచ్చే బర్రెను కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు: కేటీఆర్
ఎస్సారెస్పీ నిర్వాసితురాలికి 2 వారాల్లోపు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వండి: హైకోర్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News