పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా: రాజాసింగ్
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:01 PM
అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ‘పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, మార్చి 16: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కార్యాలయంలో కూర్చున్న రాజాసింగ్.. పార్టీ నిర్ణయాలు, విధి విధానాలపై మరోసారి చర్చించారు. బీజేఎల్పీలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
కొన్ని ఛానల్స్‌లో పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నేతలను రాజాసింగ్ బతిమిలాడుతున్నారని వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే ఎవరు ఎవరిని బతిమిలాడుతున్నారో భవిష్యత్తులో తేలుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరుగుతున్నానని రాజాసింగ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. రాజీనామా సమయంలో చెప్పినట్టే ఇప్పటికీ అదే కార్యక్రమాలు చేస్తున్నానని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం బీజేపీ ఛాంబర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వెళ్తూ రాజాసింగ్‌ను గమనించి సరదాగా సంభాషించారు. ‘సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీ లోపలికి ఎలా వెళ్తారు? బయటకు రా’ అని సరదాగా అన్నారు కేటీఆర్. ‘మీరు కూడా బీజేపీ ఛాంబర్‌లోకి రావాలి’ అంటూ కేటీఆర్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి...
అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాడుతాం: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
Read Latest Telangana News And Telugu News