Share News

‘మునుగోడు’ కోసమే సీఎంను కలిశా

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:56 AM

మునుగోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని, అంతేతప్ప మంత్రి పదవి కోసం కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు.

‘మునుగోడు’ కోసమే సీఎంను కలిశా
Komatireddy Rajagopal Reddy

  • మంత్రి పదవి కోసం కాదు: రాజగోపాల్‌రెడ్డి

సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని, అంతేతప్ప మంత్రి పదవి కోసం కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మునుగోడు ప్రాంతం కొన్నేళ్లుగా సాగునీటికి నోచుకోక ఎడారిగా మారిందని, గత ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేసి వదిలేసిందని విమర్శించారు.


కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చేలా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానన్నారు. అందులో భాగంగానే ఇటీవల నకిరేకల్‌లో జరిగిన సీఎం బహిరంగ సభకు వెళ్లానని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎంను కలిసినా.. మంత్రి పదవి కోసమేనని కొందరు బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు మునుగోడు ప్రాంత అభివృద్ధే ధ్యేయమని, ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరోసారి సీఎంను కలుస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్‌?!

ఆర్టీసీ ఎన్నికల్లో ‘ఎంప్లాయీ‌స్’దే విజయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:56 AM