రాహుల్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:17 AM
భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లారు.
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఆ రాత్రి హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో బస చేశారు.
శనివారం ఉదయం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన రాహుల్ వారితో సరదాగా ముచ్చటించారు. అయితే, ఢిల్లీ విమానానికి టైమ్ అవడంతో భారత్ సమ్మిట్ కార్యక్రమం ముగియక ముందే అక్కడి నుంచి బయలుదేరారు. రాహుల్‌గాంధీకి మహేశ్‌గౌడ్, భట్టి, పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం