Share News

రూ.3,295 కోట్లతో రేడియల్‌ రోడ్డు-2

ABN , Publish Date - Sep 28 , 2026 | 07:14 AM

హైదరాబాద్‌ నగరంలోకి రాకుండానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించేలా.. ఓఆర్‌ఆర్‌ నుంచి రీజనల్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా నిర్మించ తలపెట్టిన రేడియల్‌ రోడ్లలో రెండో రోడ్డుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.

రూ.3,295 కోట్లతో రేడియల్‌ రోడ్డు-2
Radial Road 2 Budvel to Nacharam road

  • ఓఆర్‌ఆర్‌ వద్ద బుద్వేల్‌ నుంచి ఎన్‌హెచ్‌ 167పై ఉన్న నాచారం వరకు నిర్మాణం

  • మూడు ప్యాకేజీల్లో పనులు.. 18నెలల గడువు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలోకి రాకుండానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించేలా.. ఓఆర్‌ఆర్‌ నుంచి రీజనల్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా నిర్మించ తలపెట్టిన రేడియల్‌ రోడ్లలో రెండో రోడ్డుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బుద్వేల్‌ నుంచి ఎన్‌హెచ్‌ 167లోని నాచారం వరకు రేడియల్‌ రోడ్డు-2 పనులను వేగవంతం చేసింది. సుమారు 81 కిలోమీటర్ల పొడవునా రూ.3,295 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. తాజాగా నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశంలో కాంట్రాక్టర్ల సందేహాలను నివృత్తి చేశారు. ఈ రోడ్డు రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమం వైపు, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల అభివృద్ధికి రాచమార్గం కానుంది. ఈ రోడ్డే భవిష్యత్తులో పారిశ్రామిక కారిడార్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.


మూడు ప్యాకేజీలు.. 18 నెలల గడువు

శంషాబాద్‌, షాబాద్‌, కొందుర్గు, పూడురు, పరిగి మండలాల పరిధిలోని దాదాపు 26 గ్రామాల వెంట రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చారు. మూడు ప్యాకేజీలలో 18 నెలల్లో ఈ రోడ్డును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్యాకేజీ-1లో బుద్వేల్‌ నుంచి షాబాద్‌ వరకు 29.50 కిలోమీటర్లు, ప్యాకేజీ-2లో షాబాద్‌ నుంచి గూడురు వరకు 27 కిలోమీటర్లు, ప్యాకేజీ-3లో గూడూరు నుంచి ఎన్‌హెచ్‌ 167పై ఉన్న నాచారం వరకు 24.65 కిలోమీటర్ల మేర రోడ్డు ఉన్నాయి. 75 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు అవసరమైన భూసేకరణ కోసం రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల అధికారులు చర్యలు చేపట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మన్మోహన్‌ పేరుతో యూనివర్సిటీ పెట్టాం

రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 07:14 AM