Share News

వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:08 AM

గవర్నర్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి శివ్‌ ప్రతాప్‌ శుక్లా అధ్యక్షతన డిసెంబరు 21న జరగనున్న ఆ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఉప కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య తెలిపారు.

వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము

  • వచ్చే నెల 21న రాష్ట్రానికి రాక

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : గవర్నర్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి శివ్‌ ప్రతాప్‌ శుక్లా అధ్యక్షతన డిసెంబరు 21న జరగనున్న ఆ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఉప కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య తెలిపారు.


2025-26 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన 40 మంది విద్యార్థులకు, పీజీ పూర్తిచేసిన 100 విద్యార్థులకు, యూజీ పూర్తిచేసిన 1,000 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:10 AM