Share News

బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - May 25 , 2026 | 08:43 PM

సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.

బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మంత్రి పొంగులేటి
TG Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, మే 25: సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఆ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేటీఆర్‌కు ఆయన స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందంటూ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి చురకలంటించారు. జూన్ 1వ తేదీన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని వివరించారు.


మే 23వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటామంటున్న డ్రామారావు.. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చారని కేటీఆర్‌కు పొంగులేటి గుర్తు చేశారు. ఇక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదంటూ కేటీఆర్‌కు పొంగులేటి సూచించారు.


రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదని కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు సిద్ధమేనా అంటూ కేటీఆర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీంకోర్టులో నేషనల్ హైవేస్ అథారిటీకి గట్టి ఎదురుదెబ్బ!

మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్

Read Latest TG News And Telugu News

Updated Date - May 25 , 2026 | 09:12 PM