భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:57 AM
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ పేరు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News