ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు..
ABN , Publish Date - May 10 , 2026 | 10:56 AM
ఈరోజు (ఆదివారం) తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: ఈరోజు(ఆదివారం) తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నందుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
యువతకు కొత్త అవకాశాలు కల్పించడానికి, తెలంగాణ ప్రగతిని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్న ఎన్డీయే కేంద్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారిస్తున్న ప్రధాని మోదీకి జనసేన పార్టీ తరఫునా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.
కాగా, ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 3 గంటలకు హెచ్‌ఐసీసీకి వెళ్తారు. అనంతరం అక్కడ జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొని రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇళ్లకూ ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లండన్‌లో కౌన్సిలర్‌గా భూపాలపల్లి జిల్లా యువతి
ఇంటర్మీడియట్‌లో యథావిధిగా అడ్మిషన్లు చేపట్టండి: సీఎం ఆదేశం