ఇంటర్మీడియట్‌లో యథావిధిగా అడ్మిషన్లు చేపట్టండి: సీఎం ఆదేశం
ABN , Publish Date - May 10 , 2026 | 10:42 AM
ఇంటర్మీడియట్ అడ్మిషన్లు యథావిధిగా చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, మే10: ఇంటర్మీడియట్ అడ్మిషన్లు యథావిధిగా చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కాలేజీ ప్రవేశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న 11, 12 తరగతులు నిర్వహించాలని గతంలో రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
పదో తరగతి తర్వాత పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వ పరిశీలనలో తెలింది. ఈ సమస్యను అధిగమించేందుకు 11, 12 తరగతుల విధానం అవలంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ విధానం వల్ల 11, 12 తరగతులతో మేలు జరుగుతుందని ప్రభుత్వానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కానీ సాంకేతిక సమస్యలతోపాటు పలు కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
దీంతో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. భాగస్వాములతో విస్తృత సంప్రదింపులతోపాటు శాసనసభలో చర్చ తర్వాత ఈ విలీనం ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్
లండన్‌లో కౌన్సిలర్‌గా భూపాలపల్లి జిల్లా యువతి
For More TG News And Telugu News