Share News

లండన్‌లో కౌన్సిలర్‌గా భూపాలపల్లి జిల్లా యువతి

ABN , Publish Date - May 10 , 2026 | 06:48 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత లండన్‌లో రాయల్‌ అల్బర్ట్‌ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పూజిత ఆరున్నరేళ్ల క్రితం ఎంఎస్‌ చేయడం కోసం లండన్‌ వెళ్లారు

లండన్‌లో కౌన్సిలర్‌గా భూపాలపల్లి జిల్లా యువతి

  • రాయల్‌ అల్బర్ట్‌ వార్డు నుంచి గెలిచిన కొనకాటి పూజిత

ఐనవోలు, మే 9 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత లండన్‌లో రాయల్‌ అల్బర్ట్‌ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పూజిత ఆరున్నరేళ్ల క్రితం ఎంఎస్‌ చేయడం కోసం లండన్‌ వెళ్లారు. ఎంఎస్‌ పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం సంపాదించారు. లండన్‌లోనే ఉద్యోగం చేస్తున్న ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరిశ్రీనివాస్‌తో పూజితకు గతేడాది ఫిబ్రవరిలో వివాహమైంది. శ్రీనివాస్‌ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ క్రమంలో ఇటీవల లండన్‌లో జరిగిన ఎన్నికల్లో పూజిత ప్రతిపక్ష ‘ద గ్రీన్‌ పారీ’్ట నుంచి రాయల్‌ అల్బర్ట్‌ వార్డు కౌన్సిలర్‌గా బరిలో నిలిచారు. ఈ వార్డులో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 7న ఫలితాలు వెలువడగా పూజిత కౌన్సిలర్‌గా విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పదవీ కాలం 4 సంవత్సరాలు ఉండనుంది. ఈ విజయంపై పూజిత, శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు, బంధువులు,గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - May 10 , 2026 | 06:49 AM