ఎక్కడ వాహనం కొంటే అక్కడే రిజిస్ట్రేషన్.. ప్రజలు సహకరించండి: పొన్నం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:56 PM
నేటి నుంచి వాహనాలు కొన్న షో రూమ్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకునే నూతన విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమలులోకి తీసుకొచ్చింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ రవాణా శాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు నుంచి వాహనాల షో రూమ్ ల(డీలర్ల) వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని.. ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్‌ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుందని వెల్లడించారు.
వాహన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సారథి పోర్టల్‌లో చేరిందని... దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి తెలిపారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీలు తీసుకొచ్చిందన్నారు. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని.. ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
కాగా.. తెలంగాణ రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమల్లోకి వచ్చింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న షోరూమ్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ మేరకు అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నూతన విధానం నేటి (శనివారం) నుంచే అమలులోకి వచ్చింది. ఇకపై డీలర్లు ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
4 రోజులు 45 భేటీలు.. లోకేశ్ దావోస్ టూర్ సక్సెస్
మార్బుల్స్ దించుతుండగా ఊహించని ప్రమాదం
Read Latest AP News And Telugu News