తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
ABN , Publish Date - Jun 01 , 2026 | 03:46 PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతోందంటూ బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్01: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతోందంటూ బీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణలో సభ పెట్టుకో వచ్చన్నారు. అయితే తెలంగాణను కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చెట్టాపట్టాలు వేసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వ్యతిరేకులను ఓడించేందుకు కేసీఆర్ అన్ని విధాల సహాయం చేశారని ఆరోపించారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో కూటమి పోటీ చేసిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి వచ్చినా ఇంకెవరు వచ్చినా తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అని ఆయన జోస్యం చెప్పారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయ లేదా? అంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎండగట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేష్
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
For More TG News And Telugu News