విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:48 PM
విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సోమవారం ముంబయిలో ఎయిర్ ట్రంక్ సీఈవోతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
అమరావతి, జూన్1: విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సోమవారం ముంబయిలో ఎయిర్ ట్రంక్ సీఈవోతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలత కలిగి ఉందని ఆయనకు మంత్రి లోకేష్ వివరించారు. అలాగే డేటా సెంటర్ హబ్‌గా విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఏఐ, డేటా హైపర్ స్కేల్ హబ్‌గా విశాఖ నగరం ఆవిర్భవిస్తోందన్నారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ తదితర ప్రధాన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని రాబిన్ ఖుదాకు మంత్రి లోకేష్ సోదాహరణగా వివరించారు.
విశాఖపట్నం నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ సీఈవోకు లోకేష్ స్పష్టం చేశారు. మల్టీ - గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకో సిస్టమ్ అభివృద్ధిపై తాము దృష్టి సారించామన్నారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని రాబిన్ ఖుదాకు లోకేష్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా తమ వద్ద సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గతేడాది అక్టోబర్‌లో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తొలిసారి రాబిన్ ఖుదాతో మంత్రి లోకేష్ తొలిసారి సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత్‌లో విస్తరణ కోసం ఎయిర్ ట్రంక్ సంస్థ బృందం పలుమార్లు ఏపీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. భారత్‌లో ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసిన తర్వాత విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిర్ ట్రంక్ భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో ఆ సంస్థ ప్రాజెక్టులు కలిగి ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
లుధియానాలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి
For More AP News And Telugu News