లుధియానాలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:15 PM
పంజాబ్ లుధియానాలోని ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ లుధియానాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ పరిశ్రమలో విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బందులు పడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించి, భద్రతా చర్యలు తీసుకున్నారు. విషవాయువు ఎలా లీక్ అయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also Read:
నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు
పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 35మంది ప్రమాణస్వీకారం..