Share News

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

ABN , Publish Date - Jun 01 , 2026 | 02:02 PM

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి.

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం..
Supreme Court of India

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది (Supreme Court judges).


కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం (Judicial appointments).. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్‌ చంద్రశేఖర్‌ (బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్‌ షీల్‌ నాగు (పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ (మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్‌ అరుణ్‌ పళ్లి (జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), సుప్రీం కోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది వి. మోహన ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 02:02 PM