గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా.. అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ : మంత్రి దుద్దిళ్ల
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:38 AM
అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. భారత్ సమ్మిట్-26లో శనివారం ఆయన మాట్లాడుతూ.. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు.
సమ్మిట్‌లో భాగంగా హెచ్‌ఐసీసీలో 12 అంతర్జాతీయ ప్యానెల్స్, హైటెక్స్‌లో 8 ‘తెలంగాణ రైజింగ్’ సెషన్లతో పలు ప్రత్యేక చర్చలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, వాతావరణ మార్పులు, శాంతి, మీడియా భవిష్యత్తు, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు తదితర అంశాలపై నిర్వహించిన చర్చల్లో అనేక దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మిట్ తెలంగాణకు గౌరవంతోపాటు బాధ్యతనూ తీసుకొచ్చిందని చెప్పారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’కు హాజరు కావాలని దేశవిదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News