Share News

నిజాంపేట్‌లో కల్తీ మద్యం దందా.. లిక్కర్ మార్ట్ యజమాని అరెస్ట్

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:10 PM

నిజాంపేట్‌లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న లిక్కర్ మార్ట్ యజమాని గంధం ప్రవీణ్ గౌడ్‌ను ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిజాంపేట్‌లో కల్తీ మద్యం దందా.. లిక్కర్ మార్ట్ యజమాని అరెస్ట్

హైదరాబాద్, నవంబర్18: నగరంలోని నిజాంపేట్‌లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న లిక్కర్ మార్ట్ యజమాని గంధం ప్రవీణ్ గౌడ్‌ను ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు ప్రవీణ్ గౌడ్‌తోపాటు స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం బాటిళ్లను నిజాంపేట ఎక్సైజ్ స్టేషన్‌లో డీటీఎఫ్ అధికారులు అప్పగించారు.


లిక్కర్ మార్ట్‌ను సీజ్ చేశారు. కొంతకాలంగా ప్రవీణ్ గౌడ్ కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు గుర్తించారు. ఖరీదైన మద్యం బాటిళ్ల మూతలు తీసి.. అందులో కొంత మద్యాన్ని తొలగించి అతడు నీరు, చీప్ లిక్కర్ కలుపుతున్నట్లు కనుగొన్నారు. ఇలా అసలు మద్యానికి బదులుగా నాసిరకం మద్యం విక్రయిస్తున్నాడని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ప్రీమియం, మీడియం బ్రాండ్ మద్యం బాటిళ్లే లక్ష్యంగా ప్రవీణ్ గౌడ్ ఈ కల్తీ దందా నిర్వహిస్తున్నాడని ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యర్ధులనే గెలిపించాలి: ప్రజలకు కూటమి నేతలు పిలుపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:30 PM