Share News

నిమ్స్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:06 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి, కస్టడీలో ఉన్న నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌, అదనపు ప్రొఫెసర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

నిమ్స్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు
NIMS doctor Lakshmi Bhaskar

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి, కస్టడీలో ఉన్న నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌, అదనపు ప్రొఫెసర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 22న ఏసీబీ అధికారులు లక్ష్మీభాస్కర్‌ నివాసంలో రూ.100 కోట్లకు పైగా నగదు, స్థిరాస్తులను గుర్తించి అదేరోజు అరెస్ట్‌ చేశారు.


26న కస్టడీకి తరలించగా 28న సస్పెండ్‌ చేస్తూ నిమ్స్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 48 గంటలకు మించి కస్డడీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్‌ చేయవచ్చన్న తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌, నిమ్స్‌ యాక్ట్‌ 1989 రూల్‌ 8(2)(ఏ) నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సస్పెన్షన్‌ అరెస్టయిన తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
క్యాబినెట్‌ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు

తల్లికి వైద్యం అందడం లేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:06 AM