హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి ఒకరి మృతి..
ABN , Publish Date - Oct 20 , 2026 | 10:16 AM
హైదరాబాద్‌లోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 3 గంటలకు కారు అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 3 గంటలకు కారు అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో పిల్లర్ నంబర్ 814 వద్ద వాటర్ పైప్‌లైన్‌కు చెందిన ఎయిర్ రిలీజింగ్ వాల్వును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హయత్‌నగర్‌కు చెందిన వినీత్ (24) ప్రాణాలు కోల్పోయాడు.
కారు బలంగా ఢీకొనడంతో పైప్‌లైన్ వాల్వు ధ్వంసమై నీరు భారీ ఫౌంటైన్‌లా 30 అడుగులకు పైగా ఎగసిపడింది. దాదాపు నాలుగు గంటల పాటు నీరు రోడ్డుపై వృథాగా ప్రవహించడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జలమండలి అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జలమండలి సిబ్బంది దెబ్బతిన్న వాల్వుకు మరమ్మతులు చేపట్టి, నీటి ప్రవాహాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..: గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు