పోలీసుల కస్టడీకి భగీరథ్.. మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌కు తరలింపు..
ABN , Publish Date - May 27 , 2026 | 04:48 PM
పోక్స్ కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు.
హైదరాబాద్, మే27: పోక్స్ కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్‌ను మూడు రోజులపాటు ప్రశ్నించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. పోక్స్ కేసులో అరెస్టయిన బండి భగీరథ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడిని కస్టడీకి కోరుతూ మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. బండి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో బండి భగీరథ్‌ను చంచల్‌గూడ జైలు నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. అతడిని మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు బండి భగీరథపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మే 16వ తేదీన అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండి భగీరథ్ నుంచి మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని.. వారం రోజుల పాటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసులు స్పష్టం చేశారు. కానీ కోర్టు మాత్రం భగీరథ్‌ను మూడు రోజుల వరకే పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More TG News And Telugu News