Share News

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు నిందితులకు పోలీస్‌ కస్టడీ

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:54 PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు నిందితులకు పోలీస్‌ కస్టడీ
Moinabad Drugs Case

హైదరాబాద్: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీస్‌ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ శర్మలను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసుల అభ్యర్థనపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


కోర్టు అనుమతితో నిందితులను రేపటి నుంచి కస్టడీకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో డ్రగ్స్‌ సరఫరా, నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక విషయాలను వెలికితీయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కస్టడీ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


Also Read:

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Updated Date - Mar 23 , 2026 | 04:54 PM