ఒకే ఒక గంట నన్ను హోంమంత్రిని చేయండి.. అందర్నీ లోపలేయిస్తా.. : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:40 PM
‘నాకు మంత్రి పదవి అవసరం లేదు. కానీ.. ఒకే ఒక గంట హోంమంత్రి పదవి ఇప్పిస్తే దోపిడీదొరలను లోపలేయిస్తా..’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీపైన నిప్పులుచెరిగారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ నేతల తీరు అలీబాబా అరడజను దొంగల్లా ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వారి దగ్గర అస్త్రాలు లేవని.. సభకు వస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అనే భయంతోనే వారు రావట్లేదని.. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు.
‘మా ముఖ్యమంత్రి పోనీలే అని ఊరుకుంటారు.. నాకు ఒక గంట హోంమంత్రి పదవి ఇస్తే తడాఖా చూపిస్తా.. గంట సేపట్లోనే అందరినీ లోపల వేయిస్తా.. ఒకే ఒక గంటసేపు హోంమంత్రిగా అవకాశం ఇస్తే చాలు..’ అని దయాకర్ పేర్కొన్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నేతలను దయాకర్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బూతుల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం నిజంగా భూస్వామి వర్గానికి చెందినదే అయితే.. హైదరాబాద్‌లో సరైన ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. భూదాన్, అసైన్డ్, దేవాలయ భూములను కల్వకుంట్ల కుటుంబం వారు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. కవిత అడుగుతున్న ప్రశ్నలకు హరీశ్ రావు, కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:
385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలన
వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలు నిర్వహిస్తాం: మంత్రి నిమ్మల