Share News

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. అనిపిస్తోంది: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:01 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌తో పాటు తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటన తమ కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. అనిపిస్తోంది: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
Anirudh Reddy On Phone Tapping

హైదరాబాద్: సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ మాత్రమే కాకుండా తన తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. 'మీ భర్తతో మాట్లాడే విషయాలను వేరే వాళ్లు వింటే మీకు ఎలా ఉంటుంది?' అంటూ ఆయన ప్రశ్నించారు. తన తల్లి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్న ఆయన.. కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం బాధాకరమని అన్నారు.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తమ కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. 'ఇంటికి వెళ్తే మా భార్య నన్ను తిడుతోంది. నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని నా భార్య అడిగితే ఏం చెప్పలేకపోతున్నా’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. 'బిజినెస్‌ చేసుకుంటూ ఉంటే బాగుండేది. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా' అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా చర్యలు చేపడతారనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.


Also Read:

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

For More Latest News

Updated Date - Jun 01 , 2026 | 03:20 PM