Share News

కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:43 AM

మంత్రి కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని పంచాయతీ రాజ్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు
Seethakka Konda Surekha

  • పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క

  • మహబూబాబాద్‌లో స్మార్ట్‌ కార్డుల పంపిణీ ఫ్లెక్సీలో

  • కనిపించని సురేఖ ఫొటో

కొత్తగూడ, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని పంచాయతీ రాజ్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి సురేఖ ఫొటో కనిపించలేదు. దీనిపై సీతక్క స్పందిస్తూ.. కార్యక్రమానికి ఏ శాఖ మంత్రి వస్తే వారి ఫొటోనే ఉంటుందని, సోమవారం మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన సమావేశాల్లోని కొన్ని ఫ్లెక్సీల్లో తన ఫొటో కూడా లేదని పేర్కొన్నారు. స్థానిక నాయకుల లోపంతో అలా జరిగి ఉండవచ్చని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి
భువనగిరి.. రణరంగం

ఆర్థికమంత్రి భార్యపై చర్యలు ఉండవా?

Updated Date - Sep 02 , 2026 | 04:43 AM