అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం: పొంగులేటి
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:45 PM
బీఆర్ఎస్ పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలతో పాటు ఎన్నికల హామీలను కూడా ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న అసత్య ఆరోపణలను లెక్కచేయకుండా, పేదవాడే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. భూములకు సంబంధించిన సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పొంగులేటి తెలిపారు. వచ్చే 50 రోజుల్లో సదాబైనామా అంశాల్లో న్యాయమైన సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.
Also Read:
హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా
కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినడం మంచిదేనా?
For More Latest News