కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినడం మంచిదేనా?
ABN , Publish Date - Apr 24 , 2026 | 02:13 PM
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లలో పుచ్చకాయ ముఖ్యమైనది. ఇది శరీరానికి తేమను అందించి హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా?
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం వరకు నీరు ఉంటుంది కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? ఇది కిడ్నీలను శుభ్రపరుస్తుందా? అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. దీనిపై నిపుణుల అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుందాం..
వైద్య నిపుణుల ప్రకారం, పుచ్చకాయ కిడ్నీలను క్లీన్ చేస్తుందనే మాట పూర్తిగా నిజం కాదు. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించే పనిని ప్రధానంగా మూత్రపిండాలే చేస్తాయి. పుచ్చకాయ మాత్రం శరీరానికి తేమను అందించి హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది.
మితంగా తీసుకోవాలి
ఈ పండులో విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే, దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. అధికంగా తింటే చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పుచ్చకాయ తినడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News