Share News

మెడికవర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే కథనాలు వద్దు : హైకోర్టు

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:58 AM

మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను ప్రసారం చేయకూడదన్న ఆంక్షలు విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మెడికవర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే కథనాలు వద్దు : హైకోర్టు
Telangana High Court

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను ప్రసారం చేయకూడదన్న ఆంక్షలు విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురించిన కథనాలను తిరిగి ప్రచురించ కూడదని తెలిపింది. సహృదయ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మెడికవర్‌ హాస్పిటల్స్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మన్నె క్రిశాంక్‌, హరీష్‌ రెడ్డి, శంకర్‌ గౌడ్‌లతో పాటు సంబంధిత మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది.


వాటిని తిరిగి ప్రచురించరాదని ఆదేశించింది. విచారణ పూర్తయి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా ప్రతివాదులు తమ వాదనలు వినిపించే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. డిజిటల్‌ మాధ్యమాల్లో నిజానిజాలు నిర్థారించకుండా తమకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నట్టు ఆ సంస్థ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 06:58 AM