Share News

మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో 3 వారాల గడువు

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:53 AM

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వివరాల నమోదు ప్రక్రియకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) మరో మూడు వారాల గడువు ఇచ్చింది.

మెడికల్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో 3 వారాల గడువు
Medical Faculty

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వివరాల నమోదు ప్రక్రియకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) మరో మూడు వారాల గడువు ఇచ్చింది. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానం(అబాస్‌) పోర్టల్‌లో నేషనల్‌ మెడికల్‌ రిజిస్టర్‌(ఎన్‌ఎంఆర్‌) స్టేట్‌ మెడికల్‌ రిజిస్టర్‌ నంబర్లను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేస్తూ ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్‌ రాఘవ్‌ లంగర్‌ అధికారిక మెమోరాండం విడుదల చేశారు.


గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆ నంబర్లను నెలరోజుల్లోగా నమోదు చేయాల్సి ఉంది. పలు వైద్య కళాశాలల నోడల్‌ అధికారులు ఈ ప్రక్రియను ఇంకా పెండింగ్‌లోనే ఉంచినట్లు, మరికొందరు తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తమ పరిశీలనలో తేలడంతో గడువు పొడిగిస్తున్నట్లు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...
ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ
దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:53 AM