Share News

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:39 AM

ఫ్యూచర్‌ సిటీ విస్తరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లు, 3 డివిజన్లు, పలు పోలీస్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ
Future City

  • కొత్తగా జోన్లు, డివిజన్లు, పోలీ్‌సస్టేషన్లు

  • మహేశ్వరం, షాద్‌నగర్‌, చేవెళ్ల కేంద్రాలుగా విభజన

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ విస్తరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లు, 3 డివిజన్లు, పలు పోలీస్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహేశ్వరం, షాద్‌నగర్‌, చేవెళ్ల కేంద్రాలుగా పోలీసు యంత్రాంగాన్ని విస్తరించనుంది. కమిషనరేట్‌ పరిధిలో షాద్‌నగర్‌, చేవెళ్ల జోన్లు.. ఆమనగల్‌, కొత్తూరు, మొయినాబాద్‌ డివిజన్లు కొత్తగా రానున్నాయి. మహేశ్వరం, షాద్‌నగర్‌, చేవెళ్లలో మహిళా పోలీస్‌స్టేషన్లతోపాటు ట్రాఫిక్‌ జోన్‌-1, 2ను ఏర్పాటు చేయనున్నారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌ మంగళవారం జీఓ జారీ చేశారు.


గతంలో ఉన్న పోలీస్‌ కమిషనరేట్లు, జిల్లాలు, జోన్లు, డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేస్తూ కొత్త పరిధులను ఖరారు చేశారు. కాగా కమిషనరేట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని పోలీస్‌ స్టేషన్ల పేర్లను కూడా మార్చనున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ జోన్‌-1, 2ను ఏర్పాటు చేస్తారు. చేవెళ్ల, షాద్‌నగర్‌, మహేశ్వరం ట్రాఫిక్‌ డివిజన్లతో పాటు మొయినాబాద్‌, కొత్తూరు, ఆమనగల్‌ ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌ జోన్‌-1 పరిధిలో మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల్‌, యాచారం, మీర్‌ఖాన్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధులు ఉండనున్నాయి. ట్రాఫిక్‌ జోన్‌-2 పరిధిలో మొయినాబాద్‌, షాబాద్‌, అజీజ్‌నగర్‌, చేవెళ్ల, మోకిల, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, కొందుర్గ్‌, చౌదరిగూడెం తదితర పోలీ్‌సస్టేషన్‌ల పరిధులను చేర్చారు.


ఇవి కూడా చదవండి...
సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ
దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:40 AM