Share News

దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:49 AM

సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ఏజెంట్లు, నకిలీ కేవైసీ డాక్యుమెంట్లు అందిస్తున్న నేరగాళ్లపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) భారీ ఆపరేషన్‌ నిర్వహించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో సీఎస్‌బీ భారీ ఆపరేషన్‌
Mule accounts

  • సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ ఖాతాలు

  • సమకూర్చే 100 మందికి పైగా ఏజెంట్ల అరెస్ట్‌

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ఏజెంట్లు, నకిలీ కేవైసీ డాక్యుమెంట్లు అందిస్తున్న నేరగాళ్లపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2 వారాల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 100 మందికి పైగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏకకాలంలో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి.


సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చే ఏజెంట్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిం ది. అరెస్టయిన నిందితులనుంచి పెద్ద సంఖ్యలో మ్యూల్‌ ఖాతాల డెబిట్‌ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు స్వాధీనంచేసుకున్నారు. దర్యాప్తుల్లో లభించిన సమాచారం ఆధారంగా మ్యూల్‌ ఖాతాలను సమకూర్చే ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుబడిన నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌లపై హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. విచారణ తర్వాత ప్రధాన సూత్రధారులు, సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌పై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...
ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ
బైక్‌ను ఢీకొన్న వాహనం.. కుటుంబం ఛిద్రం!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:49 AM