Share News

బైక్‌ను ఢీకొన్న వాహనం.. కుటుంబం ఛిద్రం!

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:44 AM

గుర్తుతెలియని వాహనం దూసుకొచ్చి బైక్‌ను ఢీ కొనడంతో ఓ కుటుంబమే అంతమైంది. భార్యాభర్తలు, వారి 9 ఏళ్ల బాబు మృతిచెందారు. పదకొండేళ్ల పాప ప్రాణాలతో బయటపడింది.

బైక్‌ను ఢీకొన్న వాహనం.. కుటుంబం ఛిద్రం!
Road accident

  • భార్యాభర్తలు, కుమారుడి దుర్మరణం..

  • ప్రాణాలతో బయటపడ్డ కూతురు

చేవెళ్ల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం దూసుకొచ్చి బైక్‌ను ఢీ కొనడంతో ఓ కుటుంబమే అంతమైంది. భార్యాభర్తలు, వారి 9 ఏళ్ల బాబు మృతిచెందారు. పదకొండేళ్ల పాప ప్రాణాలతో బయటపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి సమీపంలో మంగళవారం రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొయినాబాద్‌ మండలం మేడిపల్లికి చెందిన కుమ్మరి మధు(35), సావిత్రి (26) దంపతులకు కూతురు అక్షయ (11), బాబు ధనూష్‌ (9) ఉన్నారు. దంపతులు సెంట్రింగ్‌ కూలీలుగా చేస్తున్నారు.


చేవెళ్ల మండల పరిధిలోని చన్‌వల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు నలుగురూ కలిసి బైక్‌పై వెళ్లారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. తీవ్రగాయాలతో దంపతులు, ధనుష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. పాప అక్షయ రోడ్డు పక్కన దూరంగా పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం 108లో చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కన్నవారు, తమ్ముడు ఇక లేడని తెలిసి ఏడుస్తున్న పాపను ఓదార్చడం ఎవ్వరివల్లా కాలేదు.


ఇవి కూడా చదవండి...
ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ
దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:44 AM