Share News

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు..

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:06 AM

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును వారు లాక్కెళ్లారు.

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు..

హైదరాబాద్, ఆగస్టు 15: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం రహధారిపై ఒంటరిగా నడుచుకు వెళ్తున్న జక్కుల సుజాత (58) మహిళ మెడలోని బంగారపు గొలుసును దుండగులు లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సహాయంతో డయల్ 100కి ఆమె కాల్ చేసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.


పల్సర్ బైక్‌పై హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు తన మెడలోని గొలుసు లాక్కుని వెళ్లారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైన్‌స్నాచింగ్ జరిగిన పరిసర ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. చైన్‌స్నాచింగ్‌కు ఉపయోగించిన పల్సర్ బైక్‌ నెంబర్‌‌ను సీసీ టీవీ కెమెరా ద్వారా గుర్తించారు. చైన్ స్నాచర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్

చాక్లెట్ లాక్కుందని తల్లిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 10:53 AM