ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 16 , 2026 | 08:54 AM
దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముంబై, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎవరికి వారు ప్రత్యేక రీతిలో జరుపుకున్నారు. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తనదైన శైలిలో ఈ వేడుకలు నిర్వహించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవిషాగ్ హెఫర్.. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ)కు ఆమె చేరుకున్నారు. జాతీయ జెండాలను రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులకు అవిషాగ్ హెఫర్ అందజేశారు. ఆమె తెల్ల చొక్కా, నల్ల స్కర్ట్ ధరించారు. చేతిలో భారీగా జాతీయ జెండాలు పట్టుకున్నారు. ఆమె స్టేషన్‌లో తిరుగుతూ.. చిరునవ్వుతో ప్రయాణికులకు ఆ జెండాలను అందిస్తున్నారు. ఆ వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేశారు.
హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ముంబైలోని ఇజ్రాయెల్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ అవిషాగ్ హెఫర్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేసి.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మనకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చాక్లెట్ లాక్కుందని తల్లిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్
మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే..
For More Viral News And Telugu News